Skip to main content

Namaste NRI

క్రేజీ ఫెలో ప్రీరిలీజ్ ఈవెంట్

ఆది సాయికుమార్ కథానాయకుడిగా కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం క్రేజీ ఫెలో. దిగాంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ కథానాయికలు. ఫణి కృష్ణ సిరికి దర్శకుడు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో శర్వానంద్ మాట్లాడుతూ ఆది నాకు బ్రదర్స్ లాంటి వాడు. క్రేజీ ఫెలోలో రన్ రాజా రన్ ఫ్లేవర్ కనిపిస్తోంది. క్రేజీ ఫెలో పెద్ద సక్సెస్ కావాలి. దర్శకుడు ఫణి కృష్ణ టేకింగ్ బావుంది. మాటల్లో మంచి కామెడీ టైమింగ్ వుంది అన్నారు. ఆదిసాయికుమార్ మాట్లాడుతూ క్రేజీ ఫెలో సినిమాలో మంచి ఎమోషన్ కూడా వుంటుంది. కథని బలంగా నమ్మి చేశాం అని చెప్పారు. చిత్ర దర్శకుడు ఫణి కృష్ణ మాట్లాడుతూ నేను చెప్పిన కథ నచ్చి, నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత రాధామోహన్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఈ సినిమా కోసం చాలా క్రేజీగా పని చేశాం అన్నారు. ఆదికి సరిపోయే సజ్టెక్ట్ ఇది. మంచి సినిమా చేసేందుకు టీమ్ కష్టపడ్డారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది నిర్మాత కెకె రాధామోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నటీ మిర్నా మీనన్, దర్శకులు సంపత్ నంది, మారుతి, సంగీత దర్శకుడు ధృవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events