క్రెడాయ్ ప్రాపర్టీ షో ఈ నెల 13న ప్రారంభం కానుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్‌లో క్రెడాయ్ పదో ఎడిషన్ ప్రాపర్టీ షో నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మూడు రోజుల పాటు ఈ ప్రాపర్టీ షో జరుగనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని రియల్ ఏస్టేట్ డెవలపర్లు, మెటీరియల్ వెండార్లు, బిల్డింగ్ మెటీరియల్ మ్యానుఫాక్చరర్స్, కన్సల్టెంట్స్ ఈ ప్రాపర్టీలో షోలో భాగస్వాములు కానున్నారు. రియల్ ఏస్టేట్ రంగంలోని అత్యాధునిక ఆవిష్కరణలతో పాటు అందరి అవసరాలు, బడ్జెట్‌కు తగినట్లు ఫ్లాట్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్లను ఈ షోలో ప్రదర్శించనున్నారు.
అలాగే ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, రిటైల్, కమర్షియల్ కాంప్లెక్స్‌లను కూడా ప్రదర్శనకు ఉంచనున్నారు. కొనుగోలుదారులు తమకు అనుకూలమైన ప్రాజెక్టుల గురించి తెలుసుకోవడంతో పాటు కొనుగోలు చేసేందుకు ఈ ప్రాపర్టీ షో ఉపయోగపడుతుందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కొవిడ్ నిబంధనలను పక్కా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.