Namaste NRI

అంతర్జాతీయ ప్రమాణాలతో డెకాయిట్‌ : అడివి శేష్‌

హీరో అడివి శేష్‌ నటిస్తున్న కొత్త సినిమా డెకాయిట్‌. షానియల్‌ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాకు సునీల్‌ నారంగ్‌ సహనిర్మాత. అడివి శేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన తర్వాత మేకర్స్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అడివి శేష్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో డెకాయిట్‌ చిత్రాన్ని తీశామన్నారు. దర్శకుడు షానియల్‌ డియో నా బెస్ట్‌ ఫ్రెండ్‌. ఇద్దరం యూఎస్‌లో కలిసి పెరిగాం. ఒకరి సంస్కృతిని ఒకరం అర్థం చేసుకొని మంచి హైబ్రిడ్‌ సినిమా చేశాం. తను సాంకేతికంగా హాలీవుడ్‌ స్టైల్లో తీశాడు. నాగార్జున హలో బ్రదర్‌ సినిమాలోని కన్నెపెట్టరో కన్ను కొట్టరో పాటను బీజీఎం కోసం ఉపయోగించాం అన్నారు. ఇప్పటికీ చాలా సినిమాల్లో నటించినా పేరు ముందు ట్యాగ్‌ ఎందుకు పెట్టుకోలేదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అడివి శేష్‌ బదులిస్తూ చిన్నప్పుడే అమ్మానాన్న నాకు అడివి శేష్‌ అనే ట్యాగ్‌ ఇచ్చారు. అందుకే మరో ట్యాగ్‌ వద్దనుకున్నా. ఏదో ఒక ట్యాగ్‌ పెట్టుకోవడం నాకు నచ్చదు. మంచి సినిమాలతో నటుడిగా గుర్తుండిపోవాలన్నదే నా అభిమతం అని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events