Namaste NRI

ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,00,103 పరీక్షలు నిర్వహించగా 3,040 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 19,17,253 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడిరచింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 14 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,960కి చేరింది. 24 గంటల వ్యవధిలో 4,576 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,73,993కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,300 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

                కరోనాతో తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News