Skip to main content

Namaste NRI

శాంతి చర్చలు జరిగినా… ఆగని దాడులు

గత అయిదు వారాలుగా ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల మోత కొనసాగిస్తేనే ఉంది. టర్కీలో ఇస్తాంబుల్‌లో ఇటీవల జరిగిన శాంతి చర్చల్లో సైనిక కార్యకలాపాలు తగ్గిస్తామని చెప్పినప్పటికీ రష్యా దాడులు మాత్రం ఆపడం లేదు.ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సరిహద్దులు, చెర్నిహివ్‌లోని జనావాసాలపై క్షిపణులతో విరుచుకుపడిరది. మైకోలివ్‌లోని పరిపాలనా భవనంపై చేసిన దాడులో 20 మంది మృతి చెందారు. దినిప్రోపెత్రోవ్స్‌లోని సైనిక స్థావరంపై చేసిన రాకెట్‌ దాడుల్లో ఇద్దరు మరణించారు. ఈ దాడుల్లో సైనిక కేంద్రం అడ్మినిస్ట్రేటివ్‌ భవనం, ఇంధన డిపో ధ్వంసమయ్యాయి. మరోవైపు చెర్నోబిల్‌ న్యూక్లియర్‌ ప్లాంట్‌ నుంచి రష్యా బలగాలు వెనక్కి వెళ్లిపోయినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది.

                రష్యా సేనల దాడులను ఉక్రెయిన్‌ బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయి. రష్యా భూభాగంలోని ఆయుధ డిపోపై దాడి చేశాయి. బాలిస్టిక్‌ క్షిపణితో ఉక్రెయిన్‌ దళాలు జరిపిన దాడిలో ఆయుధ డిపో ధ్వంసమైంది. అయిదు వారాలుగా రష్యా కొనసాగిస్తున్న దండయాత్రలో ఇరువైపులా వేల మంది మృతి చెందారు.

Social Share Spread Message

Latest News