కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాటా ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌లలో ఒకటైన దీపావళి సంబరాలు బే ఏరియా తెలుగు కమ్యూనిటీలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ ఈవెంట్‌కు స్థానిక సంఘాల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. టాలీవుడ్ ప్రముఖ గాయకులు మంగ్లీ, ఇంద్రావతి చౌహాన్‌ల లైవ్ కాన్సర్ట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ ఈవెంట్‌కు సంజయ్ ట్యాక్స్ ప్రో అసోసియేట్ స్పాన్సర్ కాగా, రియల్టర్ నాగరాజ్ కూడా స్పాన్సర్ చేశారు. గ్రాండ్ స్పాన్సర్‌గా ఏవీఆర్ చౌదరి, గోల్డ్ స్పాన్సర్‌గా శ్రీని గోలి రియల్ ఎస్టేట్స్, సిల్వర్ స్పాన్సర్‌లుగా PNG జ్యువెలర్స్,TESQA.IA & VYZN రియల్టీ వ్యవహరించాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల, విరిజల్లు రేడియో మద్దతునిచ్చాయి.

ఈ ఈవెంట్‌కు ఫుడ్ స్పాన్సర్స్‌గా శ్రీ కిచెన్ ఆహూతులకు పసందైన వంటకాలను అందించింది. ఈ ఈవెంట్‌లో దుస్తులు, నగలు, రియల్ ఎస్టేట్, విద్య, ఆరోగ్య సంరక్షణ విక్రేతల బూత్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఈవెంట్ ముఖ్యాంశాలు బాటా సాంస్కృతిక బృంద సభ్యులు ఫ్రీమాంట్, శాన్ రామన్, డబ్లిన్, మిల్పిటాస్, కుపెర్టినో, శాన్ జోస్ వంటి పలు ప్రాంతాలలో శిక్షణా తరగతులు నిర్వహించారు.150 మందికి పైగా పిల్లలు, యువతీయువకులు వివిధ ఫుట్ ట్యాపింగ్ డ్యాన్స్‌లలో పాల్గొన్నారు. వారందరికీ బాటా బృందం కృతజ్ఞతలు తెలిపింది. శివ కాడా, వరుణ్ ముక్క, హరి సన్నిధిలతో కూడిన బాటా ఎగ్జిక్యూటివ్ కమిటీని ఆయన పరిచయం చేశారు. రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరితో కూడిన స్టీరింగ్ కమిటీ ని కూడా పరిచయం చేశారు. సాంస్కృతిక కమిటీ లో శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి ఉన్నారు. లాజిస్టిక్స్ టీమ్ లో సందీప్ కేదారిసెట్టి, సురేష్ శివపురం, రవి పోచిరాజు ఉన్నారు.

యూత్ కమిటీలో సంకేత్, ఉదయ్, ఆది, గౌతమి, సందీప్, హరీష్ ఉన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాటా బృందానికి, వినోదభరితమైన సాయంత్రాన్ని అందించిన బ్యాండ్ సభ్యులకు బాటా సలహా బోర్డు సభ్యులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి శుభాకాంక్షలు తెలిపారు.















