Skip to main content

Namaste NRI

సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి కానుకలు

సింగ‌పూర్ పౌరుల‌కు సిండా , తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులు దీపావ‌ళి కానుక‌లు పంపిణీ చేశారు. సిండా  అంటే సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్. సిండా త‌ర‌ఫున‌ దీపావళి గూడీ బ్యాగ్‌లను సింగపూర్‌లో పంపిణీ చేశారు. భారత్‌ మూలాలు ఉన్న ఆర్థికంగా వెనుకబడిన సింగపూర్ పౌరులకు సిండా ప్ర‌తినిధులు ప్రతి ఏటా దీపావళి పండుగ జరుపుకోవడానికి సహాయం చేస్తున్నారు. ఈ ఏడాది దీపావళి అలంకరణ సామాగ్రితోపాటు కొన్ని తినుబండారాలు, పండుగ ఖ‌ర్చుల కోసం 120 డాలర్లు అందజేసింది.

ఈ నెల ఐదో తేదీ నుంచి 11 నవంబర్ వరకు దీపావళి సామాగ్రి ని పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులను సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ ప్ర‌తినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలుడు గడప కౌశల్ చంద్ర ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో అభినంద‌నీయం అని సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ ప్ర‌తినిధులు చెప్పారు.

ఈ కార్యక్రమం లో పాల్గొన్న సొసైటీ అధ్యక్షులు గడప రమేశ్ బాబు, ఇతర సభ్యులు రావుల సుగుణాకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంగళ విజయ మోహన్, పలిక ప్రణీష్, పెరుకు శివ రామ్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్ త‌దిత‌రుల‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News