Skip to main content

Namaste NRI

అమెరికా దాటి వెళ్లకండి…ఉద్యోగులకు గూగుల్ హెచ్చరిక

అమెరికా తీసుకొచ్చిన కొత్త పాలసీ నేపథ్యంలో ఉద్యోగులెవరూ అంతర్జాతీయ ప్రయాణాలు చేయొద్దని గూగుల్‌ యాజమాన్యం ఆదేశించింది. కొత్తగా తీసుకొచ్చిన సోషల్‌ మీడియా వెట్టింగ్‌ పాలసీ నేపథ్యంలో వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాది అక్టోబర్‌ వరకు వాయిదా పడినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. అమెరికాకు తిరిగి రావాలంటే ప్రస్తుతం వీసా స్టాంపింగ్‌కు కొన్ని నెలలు ఆలస్యమవుతున్నది. ఈ నెల 15 నుంచి అమెరికాలో సోషల్‌ మీడియా వెట్టింగ్‌ పాలసీని అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో తమ ఉద్యోగులకు ఈ మెయిల్‌ ద్వారా గూగుల్‌ పలు సూచనలు చేసింది. ఎఫ్‌, జే, ఎం వీసాలపైనా దీని ప్రభావం ఉన్నట్టు గూగుల్‌ న్యాయ నిపుణులు చెప్తున్నారు. వీసా అపాయింట్‌మెంట్లకు మరింత ఆలస్యం జరుగుతుందని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News