Skip to main content

Namaste NRI

అమెరికా ఆందోళన… ఎందుకో తెలుసా?

లెబనాన్‌పై జరిపిన దాడిలో ఇజ్రాయెల్ వైట్ ఫాస్ఫరస్‌ను వినియోగించినట్లుగా వచ్చిన వార్తలపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నట్లు అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ పేర్కొన్నారు. అమెరికా ఇతర దేశాల సైన్యానికి వైట్ ఫాస్ఫరస్‌ అందజేస్తుందని,  దాన్ని సక్రమంగా వినియోగిస్తూ యుద్ధ నియమాలు పాటిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, అక్టోబర్‌లో లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై తాము ఆందోళన చెందుతున్నామని, ఈ విషయంపై మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని జాన్‌ కిర్బీ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News