Skip to main content

Namaste NRI

హార్వర్డ్‌ వర్సిటీకి.. డొనాల్డ్‌ ట్రంప్‌ షాక్‌

అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గట్టి షాక్‌ ఇచ్చారు. ఆ విశ్వవిద్యాలయా నికి అందించే ఫెడరల్‌ నిధులను నిలిపివేశారు. అమెరికా ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మాన్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రభుత్వ డిమాండ్లను పాటించడం లేదనే కారణంతో ట్రంప్ సర్కార్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ డిమాండ్లను నెరవేర్చే వరకు హార్వర్డ్‌కు ఎటువంటి కొత్త గ్రాంట్లు మంజూరుచేయబోమని స్పష్టం చేశారు. ఫెడరల్ పరిశోధన గ్రాంట్లకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. యూనివర్సిటీ ట్యూషన్‌ ఫీజులను చెల్లించడానికి విద్యార్థులకు సహాయపడే ఫెడరల్ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని విద్యాశాఖ విద్యాశాఖ వెల్లడించింది.

అడ్మిషన్‌ విధానాలు, ఆడిట్‌, కొన్ని స్టూడెంట్‌ క్లబ్‌ల గుర్తింపు రద్దు వంటి సంస్కరణలు చేపట్టాలని ట్రంప్‌ సర్కార్‌ కోరగా,  అందుకు వర్సిటీ స్పందించలేదు. ప్రభుత్వానికి లొంగేది లేదని స్పష్టం చేసింది. దీంతో హార్వర్డ్‌పై ట్రంప్‌ పలు ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ మధ్యలోనే ట్రంప్ ప్రభుత్వం ఆ వర్సిటీకి అందాల్సిన 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను స్తంభింపజేసింది. మొత్తం 9 బిలియన్ డాలర్ల నిధులపై సమీక్ష జరుగుతోందని అప్పట్లో తెలిపింది. తాజా లేఖతో భవిష్యత్తులో హార్వర్డ్‌కు ఎలాంటి కొత్త గ్రాంట్లు అందవని మెక్‌మాన్ తేల్చి చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events