Namaste NRI

నాటకం సినిమాకు అమ్మలాంటిది… అనిల్‌ రావిపూడి

దిలీప్‌ ప్రకాష్‌, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఉత్సవం. ఈ చిత్రానికి అర్జున్‌ సాయి దర్శకుడు. సురేష్‌ పాటిల్‌ నిర్మాత. ఉత్సవం ప్రీరిలీజ్‌ వేడుకకు ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్‌రావిపూడి మాట్లాడుతూ నాటకరంగం, రంగస్థలం నేపథ్యంలో అద్భుత మైన కథతో ఈ చిత్రాన్ని తీశారు. నాటకం సినిమాకు అమ్మలాంటిది. ఈ తరం వారికి నాటకాల గురించి తెలియజెప్పే ప్రయత్నం అభినందనీయం అన్నారు.

  నాటకరంగం నేపథ్యాన్ని ఎంచుకొని చాలా కష్టపడి చేసిన ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. నాటక రంగాన్ని బతికించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో నటించానని సీనియర్‌ నటులు బ్రహ్మానందం అన్నారు. దర్శకుడు అర్జున్‌ సాయి మాట్లాడుతూ కళ కోసం జీవితాన్ని త్యాగం చేసిన సురభి కళాకారుల స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నా. దీనికి అందమైన ప్రేమకథను జత చేశాను. ఈ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ప్రేక్షకుల మోముపై ఓ చిరునవ్వు కనిపిస్తుంది అన్నారు. నాటకరంగం పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలనే గొప్ప సంకల్పంతో ఈ సినిమా తీశారని గీత రచయిత అనంత్‌ శ్రీరామ్‌ అన్నారు. ఈ నెల 13న విడుదలకానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events