పుష్ప-2 చిత్రం నుంచి ఇటీవల విడుదలైన పుష్ప పుష్ప అనే మాస్ గీతానికి మంచి స్పందన లభించింది. సోషల్‌మీడియాలో ఈ పాట రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ పాటను ఆలపించిన గాయకుడు దీపక్ బ్లూ పాత్రికేయులతో ముచ్చటిస్తూ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటివరకు 300లకుపైగా పాటలు పాడాను. చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం మాది. గత పన్నెండేళ్లుగా గాయకుడిగా కెరీర్ కొనసాగి స్తున్నా అన్నారు. పుష్ప పుష్ప పాట గురించి మాట్లాడుతూ దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వంలో తొలుత నాన్నకు ప్రేమతో చిత్రంలో లవ్ దెబ్బ అనే పాట పాడాను. అది పెద్ద హిట్ అయ్యింది. అలాగే తమన్ డైరెక్ష న్‌లో 35 పాటలు పాడాను. పుష్ప-2 లోని టైటిల్‌సాంగ్ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. భవిష్యత్తులో ఇండిపెండెంట్ ఆల్బమ్ చేయాలని ఉంది. ఈ మధ్యే పెద్ద సినిమాలకు పాటలు పాడాను. వాటి రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అన్నారు.