Skip to main content

Namaste NRI

ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి : భరత్ భూషణ్

ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమని అభివృద్ధి దిశగా నడిపిస్తానని, టీంతో కలిసి కృషి చేస్తానని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకి తెలిపాను అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ చైర్మన్ పి.భరత్ భూషణ్ అన్నారు. ఎపీఎస్ఎఫ్టీవీటీడీసి చైర్మన్ పదవికి ఎంపికైన తరువాత భరత్ భూషణ్ తొలిసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్వాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎపీఎస్ఎఫ్టీవీటీడీసి చైర్మన్ పదవికి ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఏపీలో చిత్ర పరిశ్రమని అభివృద్ధి దిశగా నడిపిస్తానని, టీంతో కలిసి కృషి చేస్తానని సీఎంతో చెప్పాను. వెంకటపాలెం టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర భారీ స్థాయిలో బాలకృష్ణ, కొరటాల శివ కొత్త సినిమా ప్రారంభం కావడం, మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరు అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఏపీలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిగేలా మా టీం అందరం కలిసి కృషి చేస్తాం అని తెలిపారు.

Social Share Spread Message

Latest News