యూఎస్ ఓపెన్ మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. ఫైనల్ పోరులో 18 ఏళ్ల బ్రిటీష్ కెరటం ఎమ్మా రదుకాను సంచలన చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో కెనడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3, స్కోరుతో వరుస సెట్లలో ఓడిరచి తొలి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్‌ను గెలుచుకున్న తొలి క్యాలిఫైయర్‌గా రదుకాను చరిత్ర తిరగరాసింది. 150 ర్యాంక్‌లో కొనసాగుతున్న రదుకాను తనకన్నా మెరుగైన స్థానంలో కొనసాగుతున్న 73వ ర్యాంక్ క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్‌ను ఓడిరచింది. దీంతో 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న బ్రిటన్ మహిళగా రికార్డును ఎమ్మో నెలకొల్పింది.