అఫ్గనిస్తాన్‌లో తమ బలగాలు చేపట్టిన పౌరుల తరలింపు ప్రక్రియ అమెరికా చరిత్రలోనే అతి పెద్దదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. అఫ్గన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తైన నేపథ్యంలో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ 1,20,000 వేల మంది అమెరికా పౌరులు, అమెరికా `అఫ్గన్ మిత్ర దేశాల ప్రజలను తరలించినట్లు పేర్కొన్నారు. 20 ఏళ్ళుగా అమెరికా సైన్యం అఫ్గనిస్తాన్‌లో అందిస్తున్న సేవలు నేటితో ముగిసాయి. ఆగస్టు 31లోపే ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా సురక్షితంగా ఈ ప్రమాదకరమైన ఆపరేషన్ పూర్తి చేసిన మా కమాండర్లకు ధన్యవాదాలు చెబుతున్నా అని పేర్కోన్నారు. ఇప్పటితో తరలింపు ప్రక్రియ పూర్తైనట్లు కాదని, అంతర్జాతీయ భాగస్వాములు, మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని విదేశాంగ మంత్రికి చెప్పినట్లు బైడెన్ తెలిపారు.