భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా లాస్ ఏంజెల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో భారత రాయబారిగా సేవలందించిన కెన్నెత్ జస్టర్ స్థానానికి నామినేట్ చేసినట్లు సెనేట్ ధ్రువీకరించింది. ఈ వారంలో జస్టర్‌ను కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్‌లో ప్రత్యేక విధిగా నియమించారు. 2013 నుండి లాస్‌ఏంజెల్స్ మేయర్‌గా ఎరిక్ వ్యవహరిస్తున్నారని, 12 ఏండ్ల పాటు సిటీ కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా బైడెన్ తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఎరిక్‌ను రాయబారిగా నామినేట్ చేశారని శ్వేతసౌధం తెలిపింది. అయితే ఈ నామినేషన్‌పై ఎరిక్ గార్సెట్టి హర్షం వ్యక్తం చేశారు. భారత్‌లో అమెరికా రాయబారిగా నామినేట్ చేయడాన్ని గౌరవంగా భావిస్తానని చెప్పారు. అక్కడ విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.