ఉయ్యాల జంపాల సినిమాతో రాజ్ తరుణ్‌ని హీరోగా పరిచయం చేసిన అన్నపూర్ణ బ్యానర్ మళ్లీ ఇన్నేళ్లకి తనతో మారో సినిమా తీస్తోంది. అదే అనుభవించు రాజా. శ్రీ వెంకటేశ్వర సినిమాతో కలిసి నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. శ్రీను గవిరెడ్డి దర్శకుడు. కశిష్ ఖాన్ హీరోయిన్. ఈ మూవీ టీజర్‌ని రామ్ చారణ్ లాంచ్ చేశాడు. టీజర్ చాలా ఫన్నీగా ఉందంటూ టీమ్‌కి విషెస్ చెప్పాడు. ఎలాంటి బాధలు, బాధ్యతలు లేకుండా పేకాట, కోడిపందాలు, రికార్డింగ్ డ్యాన్సులంటూ జీవితాన్ని లగ్జరీగా గడిపేసే జల్లా రాయుడిగా రాజ్ తరుణ్ కనిపిస్తున్నాడు. బంగారు గాడు ఊళ్లో, వాడి పుంజు బరిలో ఉండగా ఇంకొకడు గెలవడం కష్టం అంటూ తన గురించి తనే ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడు. తన గెటప్, గోదావరి జిల్లాల శ్లాంగ్‌లో డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నారు.