Skip to main content

Namaste NRI

ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.. సౌండ్ పార్టీ

వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్‌ జంటగా నటిస్తున్న చిత్రం సౌండ్‌ పార్టీ. సంజయ్‌ శేరి దర్శకుడు. ఫుల్‌ మీడియా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు.  ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ సకుటుంబ కథా చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్‌, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. ప్రస్తుతం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు ఆదరణ బాగుంది.అదే కోవలో ప్రేక్షకులను మెప్పించే చిత్రమిది అన్నారు. కుటుంబ అనుబంధాలు, వినోదం ప్రధానంగా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని చిత్ర సమర్పకుడు జయశంకర్‌ తెలిపారు.  ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్‌ రెడ్డి, సంగీతం: మోహిత్‌ రెహమానిక్‌, నిర్మాతలు: రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీశ్యామ్‌ గజేంద్ర, రచన-దర్శకత్వం: సంజయ్‌శేరి.

Social Share Spread Message

Latest News