Namaste NRI

విశ్వం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. కెమిస్ట్రీతో ఆకట్టుకుంటున్న హీరో హీరోయిన్‌

గోపీచంద్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం విశ్వం. కావ్యథాపర్ హీరోయిన్‌.  శ్రీను వైట్ల దర్శకత్వం. ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై పాపులర్‌ డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ఎగ్జిబిటర్‌ వేణు దోనెపూడి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలిసి తెరకెక్కిస్తు్న్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ మొదలయ్యాయి. తాజాగా విశ్వం ఫస్ట్‌ సింగిల్ మొరాకన్ మగువను విడుదల చేశారు. రాకేందు మౌళి రాసిన ఈ పాటను చేతన్ భరద్వాజ్ కంపోజిషన్‌లో పృథ్వి చంద్ర, సాహితీ చాగంటి పాడారు. గోపీచంద్‌ సూపర్ స్టైలిష్ స్టెప్పులతో సాగుతున్న పాట సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఉండబోతున్నట్టు విజువల్స్ చెబుతు న్నాయి. గోపీమోహన్‌ స్క్రీన్‌ ప్లే సమకూరుస్తుండగా, చేతన్ భరద్వాజ్‌ మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు.

గింజ గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుంది. దీనిపై నా పేరు ఉంది.. అని ఫస్ట్ స్ట్రైక్‌లో గోపీచంద్‌ చెబుతు న్న డైలాగ్స్‌ సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తున్నాయి. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్‌లో నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్‌, షకలక శంకర్‌, అజయ్ ఘోష్‌లతో సాగే కామింగ్ టైమింగ్‌ సినిమా పక్కా ఎంటర్‌టైనింగ్‌ గా ఉండబోతున్నట్టు చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events