Skip to main content

Namaste NRI

ఐదు రాష్ట్రాల పోరులో తొలి ఓటింగ్

మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 77.04 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఛత్తీస్‌గఢ్‌లో 70.87 శాతం పోలింగ్ రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు. మిజోరంలో సింగిల్ ఫేజ్ పోలింగ్ జరిగింది. కాగా నక్సల్స్ దాడుల భయాలు ఉన్న మిజోరంలో తొలివిడత పోలింగ్‌కు తక్కువ సంఖ్యలోనే జనం హాజరయ్యారు. మిజోరంలో 8.57 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు ఓట్ల ప్రక్రియ ఆరంభం అయింది. ఇది సాయంత్రం నాలుగు గంటల వరకూ సాగింది. పోలింగ్‌లో తొలి ఎనిమిది గంటల సమయంలో 69శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. మొత్తం 11 జిల్లాల్లోనూ అత్యధిక ఓటింగ్ సెర్చిప్ జిల్లాలో అత్యధికంగా 77.78 శాతం, తరువాతి క్రమంలో ఖవాజాల్‌లో 77 శాతం, హనహతియల్‌లో 74 శాతం, ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Social Share Spread Message

Latest News