తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మారుస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 మండలాలతో వరంగల్ జిల్లా, 14 మండలాలతో హన్మకొండ మండలాలను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పడబోయే హన్మకొండ జిల్లాలో 12 రెవెన్యూ మండలాలు, 139 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అలాగే వరంగల్ జిల్లాలో 15 రెవెన్యూ మండలాలు, 217 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెండు రెవిన్యూ డివిజన్లు, ఆరు నియోజకవర్గాల సమ్మిళితంతో హన్మకొండ జిల్లా అవతరించింది.