Skip to main content

Namaste NRI

మెట్‌ గాలాలో మెరిసిన అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఓ ఫ్యాషన్‌ ఈవెంట్‌లో మెరిశారు. తొలిసారి రెడ్‌కార్పెట్‌పై సందడి చేశారు.  ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్‌ ఈవెంట్లలో ఒకటైన మెట్‌గాలా గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. న్యూయార్క్‌ నగరంలోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌  లో జరిగిన ఈ గాలాలో ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరై సందడి చేశారు. ఈ గాలాలో కమలా హారిస్‌ తొలిసారి రెడ్‌ కార్పెట్‌పై అడుగుపెట్టారు. కస్టమ్‌ క్రియేషన్‌ ఆఫ్‌-వైట్‌ గౌను ధరించి సందడి చేశారు.

మెట్‌ గాలా ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్‌ ఈవెంట్లలో  ఒకటి. న్యూయార్క్‌ నగరంలోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌ లో ఏటా మే తొలి సోమవారం ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. భారత్‌ సహా ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ గాలాకు హాజరై సందడి చేస్తుంటారు. ఈ ఏడాది కూడా మెట్‌గాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈవెంట్‌లో భారత్‌ నుంచి బాలీవుడ్‌ స్టార్స్‌ షారుఖ్‌ ఖాన్‌, కియారా అడ్వాణీ, ప్రియాంక చోప్రా, నిక్‌జొనాస్‌, సింగర్ దిల్జిత్‌ దోసాంజ్‌, నటాషా పూనావాలాతోపాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ చిన్న కుమార్తె ఇషా అంబానీ తదితరులు రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events