Skip to main content

Namaste NRI

ఫైట‌ర్ నుంచి.. హృతిక్ రోష‌న్ అదిరిపోయే లుక్‌

 సిద్దార్థ్‌ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటిస్తోన్న చిత్రం ఫైటర్ ‌. వయాకామ్‌ 18 స్టూడియోస్‌-మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్త నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనిల్‌ కపూర్‌, దీపికా పదుకొనే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి హృతిక్‌ రోషన్‌ రోల్‌కు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఎయిర్ డ్రాగన్స్ విభాగంలో స్క్వాడ్రన్ పైలట్ గా పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విదేశాల్లో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు హృతిక్‌ రోషన్‌.  ఫైటర్ టీజర్‌ను డిసెంబర్ 7న విడుదల చేయనున్నారు. తొలిసారి హృతిక్ రోషన్, దీపికా పదుకొనే క్రేజీ కాంబో సిల్వర్ స్క్రీన్‌పై కలిసి కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతు న్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్‌తో మూవీ లవర్స్‌, అభిమానులు ఫుల్ ఖుషీ చేస్తున్నాడు హృతిక్‌ రోషన్‌. ఈ మూవీ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News