Skip to main content

Namaste NRI

ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాగా గీత సాక్షిగా

ఆదర్శ్, చిత్ర శుక్లా జంటగా నటిస్తున్న సినిమా గీత సాక్షిగా. ఈ చిత్రానికి కథను అందిస్తూ చేతన్ రాజ్ ఫిలింస్ పతాకంపై నిర్మించారు చేతన్ రాజ్. అంథోనీ మట్టిపల్లి దర్శకుడు. తాజాగా చిత్ర ట్రైలర్‌ను  హైదరాబాద్‌లో  విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ వాస్తవ ఘటనల ఆధారంగా ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్ సినిమా మీద అంచనాలు తీసుకొచ్చింది. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించేలా సినిమా ఉంటుంది. చేయని తప్పుకు శిక్ష ఎదుర్కొనే యువకుడి పాత్రలో హీరో ఆదర్శ్ నటన ఆకట్టుకుంటుంది. లేడీ లాయర్ పాత్రలో చిత్ర శుక్ల నటన మెప్పిస్తుంది అన్నారు. రూపేష్ శెట్టి, చరిష్మా, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  ఈ నెల 22న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో విడుదల చేస్తున్నారు.  ఈ చిత్రానికి  సాంకేతిక వర్గం:  కథ, నిర్మాత: చేతన్ రాజ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆంథోని మట్టిపల్లి, మ్యూజిక్: గోపీ సుందర్, సినిమాటోగ్రపీ: వెంకట్ హనుమ నారిశెట్టి, ఎడిటర్: కిషోర్ మద్దాలి, ఆర్ట్: నాని, డాన్స్: యశ్వంత్, అనీష్, ఫైట్స్: పృథ్వీ, పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్ ఉ ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).  

Social Share Spread Message

Latest News