Skip to main content

Namaste NRI

గీతా శంకరం ఫస్ట్‌లుక్‌

ఎస్‌.ఎస్‌.ఎం.జి ప్రొడక్షన్స్‌ పతాకంపై ముఖేష్‌గౌడ, ప్రియాంక శర్మ జంటగా నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్‌ నిర్మిస్తున్న ప్రేమకథా కావ్యం గీతా శంకరం. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆవిష్కరించారు. ఈ నెల 14 నుండి సినిమా షూటింగ్ మొదలవుతుందని ప్రకటించారు చిత్రయూనిట్.  ఈ సందర్భంగా ముకేశ్ గౌడ మాట్లాడుతూ ఈ దీపావళి కానుకగా నేను నటిస్తున్న మొదటి సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథకు నన్ను హీరోగా సెలక్ట్‌ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఇది లవ్‌ అండ్‌ ఎఫక్షన్‌తో కూడుకున్న సినిమా. సీరియల్స్‌లో ఎలా మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నానో, ఈ సినిమాతో వెండితెర మీద కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే గట్టి నమ్మకం ఉంది. యూత్‌కు ఈ గీతా శంకరం సినిమా బాగా నచ్చుతుంది అని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events