తెలంగాణ ఉద్యమ సమయం నుండి నేటి వరకు ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే బృందం అన్ని ప్రపంచ వేదికల్లో తెలంగాణ ఆకాంక్షలను, కేసీఆర్ నాయకత్వ ఆవశ్యకతను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. అదే స్ఫూర్తితో లండన్ వేదికగా జరుగుతున్న టీమిండియా`ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా హుజురాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవుకు మద్దతు లభించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ క్రికెట్ మైదానం ఓవల్‌లో ఎన్నారై టీఆర్‌ఎస్ నాయకుడు అబు జఫర్ హుజురాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా ప్లకార్డు ప్రదర్శించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరినప్పటి నుండి ఎంతో క్రియాశీలకంగా పని చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న అబు జాఫర్‌ని ఎన్నారై టీఆర్‌ఎస్ వ్యవస్థాపక అద్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అభినందించారు.