అమెరికాలోని వర్జీనియా స్టేట్ సెనేట్‌గా హైదరాబాద్‌కు చెందిన ఘజాలా హష్మీ వరుసగా మూడో సారి ఎన్నికయ్యారు. వర్జీనియా డిస్ట్రిక్ట్ 15 నుంచి ఆమె విజయం సాధించారు. ఆ రాష్ట్రంలో చట్టసభకు ఎన్నికైన మొదటి ఇండియన్-అమెరికన్, ముస్లిం మహిళగా ఆమె ఇప్పటికే చరిత్ర సృష్టించారు. తన గెలుపుపై ఆమె మాట్లాడుతూ గత నాలుగేండ్లుగా ఇక్కడ చాలా బాగా పనిచేశాం. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఓటర్లు, మద్దతుదారులు నాపై ఉంచిన విశ్వాసానికి ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడివారి ఉజ్వల భవిష్యత్తు కోసం మా పోరాటాన్ని కొనసాగిస్తాం అని అన్నారు.
కాగా, అమెరికాలో స్టానిక, రాష్ట్ర చట్టసభలకు తాజాగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 10 మంది ఇండియన్ అమెరికన్లు ఎన్నికయ్యారు. ఎక్కువ శాతం మంది విజయం సాధించిన వారిలో డెమోక్రాట్లే ఉన్నారు. వర్జీనియా స్టేట్ సేనేట్‌కు సుహస్ సుబ్రమణ్యం కూడా మరోసారి ఎన్నికయ్యారు. హౌజ్ ఆఫ్ డెలిగేట్స్‌కు గతంలో రెండుసార్లు ఎన్నియ్యారు. హూస్టన్‌లో పుట్టిన సుబ్రమణియన్.. వర్జీనియా హౌజ్‌కు ఎన్నికైన తొలి హిందువు కావడం విశేషం. వ్యాపారవేత్త కన్నన్ శ్రీనివాస్ కూడా వర్జీనియా హౌజ్ ఆఫ్ డెలిగేట్స్‌కు ఎన్నికయ్యారు. లౌడన్ కౌంటీ ఏరియా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. వర్జీనియాలో గెలిచిన ముగ్గురు భారతీయులు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులే.
న్యూజెర్సీలోని విన్ గోపాల్, రాజ్ ముఖర్జీలు డెమోక్రటిక్ పార్టీ నుంచి రాష్ట్ర సేనేట్‌కు ఎన్నికయ్యారు. న్యూజెర్సీ బర్లింగ్టన్ కౌంటీ నుంచి టీచర్ బల్వీర్ సింగ్ ఎన్నికయ్యారు. పెన్సిల్వేనియాలోని మాంట్‌గోమోరి కౌంటీ కమీషనర్‌గా నీల్ మఖిజా, ఇండియానాలోని కార్మెల్ సిటీ కౌన్సిల్‌కు డాక్టర్ అనితా జోషి ఎన్నియ్యారు. ఒహియా నుంచి ప్రియా తమిలరసన్, కనెక్టికట్ నుంచి అరుణన్ అరులపాలం గెలుపొందారు.














