Namaste NRI

లండన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

కెంట్‌లోని డార్ట్‌ఫోర్డ్‌ నగరంలో ఫీనిక్స్‌ క్వార్టర్స్‌ రెసిడెంట్స్‌ కమ్యూనిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. సామూహిక మంగళ హారతులతో వినాయక మంత్రాలు జరిపించి, పాటలు ఆలపించి మూడు రోజుల పాటు ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలను జరుపుకొన్నారు. భక్తులంతా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వినాయకుడిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. అనంతరం భారతీయ, తెలుగు వంటకాలతో విందు, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ వేడుకలో దాదాపు 150 మంది ప్రవాస భారతీయులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

                ఈ వేడుకలకను డార్ట్‌ఫోర్డ్‌ టౌన్‌ కౌన్సిలర్లు క్రిస్‌ షిప్పం, రిచర్డ్‌ వెల్స్‌, బ్రెంట్‌ కౌన్సిలర్‌ అవతార్‌ సంధు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చివరి రోజున భక్తులంతా గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ నిమజ్జనోత్సవం వైభవంగా నిర్వహించారు. కారుపై గణపతి విగ్రహాన్ని ఊరేగించి నిమజ్జనం చేశారు. ఈ వేడుకను భారతీయ పద్ధతుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నట్టు డార్ట్‌ ఫోర్డ్‌ ఫీనిక్స్‌ క్వార్టర్స్‌ రెసిడెంట్స్‌ కమ్యూనిటీ వాలంటరీ కృష్ణ పవన్‌ చల్లా తెలిపారు. ఈ ఏర్పాట్లు చేసిన మహిళకు నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Social Share Spread Message

Latest News