Namaste NRI

ప్రవాస భారతీయులకు శుభవార్త… అమెరికా-భారత్ మధ్య

 ప్రవాస భారతీయులకు శుభవార్త. దాదాపు పదేళ్ల తరువాత అమెరికా ఎయిర్‌లైన్స్‌ భారత్‌కు విమాన సర్వీసులను పునరుద్ధరించింది. దీంతో అమెరికా, భారత్‌ మధ్య నిరంతరాయ విమానయాన సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్టైంది. అమెరికా ఎయిర్‌లైన్స్‌కు చెందిన తొలి విమానం శనివారం న్యూఢల్లీిలో అంతర్జాయ విమానాశ్రయంలో దిగింది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ 2012లో చివరిసారిగా చికాగో `ఢల్లీి సర్వీసును నడిపింది. ఈ సర్వీసుకు భవిష్యత్తులో డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని సేల్స్‌ విభాగం ఎండీ టామ్‌ లాటిగ్‌ వ్యాఖ్యానించారు. అమెరికా, భారత మధ్య పెరుగుతున్న ఆర్థిక బంధాలు, అక్కడ ప్రవాసీ భారతీయులు అధికంగా ఉండటం వంటివి దీనికి దోహదపడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో సర్వీసుల విస్తరణకు కూడా ఎంతో అవకాశం ఉందన్నారు. అయితే ఈ రెండు సర్వీసులకు కస్టమర్ల నుంచి వస్తున్న స్పందనను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఢల్లీి రూట్‌లో బోయింగ్‌ 7778 విమానాన్ని వినియోగించేందుకు అమెరికా ఎయిర్‌లైన్స్‌ నిర్ణయించనట్టు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News