అమెరికాలో హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌న్యూస్. హెచ్-1బీ వీసాదారుల భాగస్వాముల ఉద్యోగానుమతికి సంబంధించిన కింది కోర్టు ఇచ్చిన అనుకూల తీర్పును సమీక్షించబోమని అమెరికా సుప్రీం కోర్టు తాజాగా నిర్ణయించింది. దీంతో, హెచ్-4 ఎంప్లాయ్‌మెంట్ ఆథొరైజేషన్ డాక్యుమెంట్‌కు (EAD- ఉద్యోగానుమతికి) సంబంధించి ప్రస్తుత నిబంధనలే కొనసాగనున్నాయి. హెచ్-1బీ వీసాదారులకు వీసా కాలపరిమితి ఆరు సంవత్సరాలకు మించి పొడిగించినా లేదా వారికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉన్న సందర్భాల్లో వారీ జీవితభాగస్వాములు(హె-4 వీసాదారులు) ఉద్యోగానుమతికి పొందేందుకు అర్హులు. 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది. గ్రీన్ కార్డుల జారీలో దశాబ్దాల తరబడి జాప్యం జరుగుతుండటంతో భారతీయులకు లాభించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.














