Skip to main content

Namaste NRI

భారతీయులకు గుడ్ న్యూస్!

భారతీయులు అమెరికా వీసాలు పొందడానికిగాను వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు అమెరికా మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తన కాన్సులేట్లలో పని చేస్తున్న పలువురు కాన్సులర్ అధికారులను భారత్‌లో  వీసా కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు తీసుకువస్తోంది. ముంబైలో వీసా కార్యకలాపాలకు సహాయం చేసేందుకు తాత్కాలికంగా నలుగురు అధికారులను అమెరికా తీసుకువచ్చింది. ఈ మేరకు ముంబైలోని యూఎస్ కాన్సులేట్  ప్రకటించింది. 

Social Share Spread Message

Latest News