Skip to main content

Namaste NRI

భారతీయులకు గుడ్‌ న్యూస్… వీసా లేకుండానే తమ దేశంలోకి ఫ్రీ ఎంట్రీ

భారతీయ పర్యాటకులకు ఆగ్నేయ ఆసియా దేశం ఫిలిప్సీన్స్ శుభవార్త చెప్పింది. వీసాలేకుండానే తమ దేశంలోకి భారతీయులు ప్రవేశించవచ్చని తెలిపింది. ఇందుకోసం రెండు రకాల స్వల్పకాలిక వీసా రహిత ప్రవేశ సౌకర్యాలను కల్పిస్తోంది. అయితే, వీటికి వేర్వేరు అర్హతా ప్రమాణాలున్నాయి.

ఈ కేటగిరీ కింద, భారతీయ పౌరులు కేవలం పర్యాటక ప్రయోజనాల కోసం ఎటువంటి వీసా లేకుండా ఫిలిప్పీన్స్‌లో 14 రోజుల వరకు బస చేయవచ్చు. అయితే, ఈ వీసా రహిత ప్రవేశాన్ని పొడిగించుకోవడానికి వీలుండదు. అంతేకాదు, దీనిని వేరే రకం వీసాగా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు.

ప్రయాణ ఉద్దేశం పూర్తిగా పర్యాటకానికి మాత్రమే పరిమితం అయి ఉండాలి. ప్రయాణ సమయానికి పాస్‌పోర్ట్ కనీసం 6 నెలలు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి. హోటల్ బుకింగ్‌లు లేదా వసతి నిర్ధారణ పత్రాలు ఉండాలి. పర్యటన ఖర్చులు భరించగలిగే సామర్థ్యం ఉందని కొన్ని రుజువులు చూపించాల్సి ఉంటుంది (ఉదా.. బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఉద్యోగ ధ్రువీకరణపత్రాలు వంటివి). రిటర్న్ లేదా తదుపరి ప్రయాణ టికెట్ ఉండాలి.

Social Share Spread Message

Latest News