అబుదాబిలోని (యూఏఈ) ప్రతిష్ఠాత్మక బాప్స్ హిందు మందిరంలో జరిగిన సత్యనారాయణ వ్రతం, రుద్రా భిషేకం కార్యక్రమాల్లో తెలంగాణ ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. మందిరాన్ని పూర్తిగా చూసిన ఆయన దాని శిల్ప నైపుణ్యతకు మంత్రమగ్ధుడయ్యారు. అనంతరం ఆది శ్రీనివాస్‌ను వేదపండితులు ఆశీర్వదించారు. యూఏఈ ఎన్నారై సెల్ అధ్యక్షుడు యస్వీ రెడ్డితో కలిసి వచ్చిన శ్రీనివాస్‌కు కార్యక్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.
దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అబుదాబి తరహా అధునీకరణకు ప్రయత్నం చేయాలని ఆయన్ను కొందరు ప్రవాసీయులు కోరగా, కేసీఆర్ ప్రభుత్వం వేములవాడ ఆలయాభివృద్ధి గురించి చెప్పింది కొండంత కానీ చేసిందేమీ లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని చెప్పారు.