Namaste NRI

అమెరికాలో ఘనంగా ఇండియా డే పరేడ్‌

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఇండియా డే పరేడ్‌ ఘనంగా నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ కవాతులో పెద్ద సంఖ్యలో ఇండియన్‌ అమెరికన్లు పాల్గొని సందడి చేశారు. జాతీయ జెండాలను చేత పట్టుకుని దేశభక్తి గీతాలు ఆలపించారు. ఢోలు వాయిస్తూ నృత్యాలు చేశారు. ఇక ఈ పరేడ్‌లో అయోధ్య రామ మందిర నమూనాను ప్రదర్శించారు. పూలతో సుందరంగా అలంకరించిన ఈ నమూనా స్థానికులకు ఎంతగానో ఆకట్టు కుంది. ఇది 18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉన్నట్లు విశ్వహిందూ పరిషత్‌ అమెరికా ప్రధాన కార్యదర్శి అమితాబ్‌ మిత్తల్‌ తెలిపారు.

50e409c6 592a 4e9f 922f 2a94141522d8 72

కాగా, భారత స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత ఏటా న్యూయార్క్‌లో జరుపుకొనే ఈ ఇండియా డే పరేడ్‌ స్వదేశా నికి వెలుపల జరిగే వేడుకల్లో కెల్లా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. న్యూయార్క్‌ నగరంలోని ఈస్ట్‌ 38వ వీధి నుంచి ఈస్ట్‌ 27వ వీధి వరకూ కొనసాగే ఈ కవాతులో ఏటా లక్ష మందికిపైగా హాజరవుతుంటారు.

f8900b5f 232d 4ed0 9e9a f342ae9bc1c6 79
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events