Skip to main content

Namaste NRI

లండన్‌లో ఘనంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలు

టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ యూకే ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా నిర్వహించారు.  పార్టీ జెండాను యూకే  అధ్యక్షుడు అశోక్‌ గౌడ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. జయశంకర్‌ సార్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అశోక్‌ గౌడ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందన్నారు. సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందన్నారు. ఎన్నారైలంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే ఉన్నారని స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు వచ్చి పార్టీ గెలుపునకు కృషి చేస్తామని ప్రవాస తెలంగాణ వాదులు తెలిపారు.

                 ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నవీన్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌ కడుదుల, సంయుక్త కార్యదర్శులు మల్లా రెడ్డి, రమేష్‌ ఇస్సంపల్లి, అధికార ప్రతినిధులు రవి కుమార్‌ రేతినేని,  రవి ప్రదీప్‌ పులుసు, లండన్‌ ఇంచార్జి నవీన్‌ భువనగిరి,  నవీన్‌ మాదిరెడ్డి, ఈస్ట్‌ లండన్‌ ఇంచార్జి ప్రశాంత్‌ కటికనేని, మధు ఆబోతు, ప్రవాస తెలంగాణ వాదులు మట్టా రెడ్డి, గణేష్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, తెలంగాణ వాదులు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events