తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు, తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీకగా నిలుస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అమ్మవారి దీవెనతో, ప్రభుత్వ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్థించారు.