Skip to main content

Namaste NRI

హనుమాన్ ట్రైలర్ వచ్చేస్తోంది

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజా సజ్జ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సూపర్‌‌హీరో మూవీ హనుమాన్. అమృత అయ్యర్ కథానాయిక.  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె.నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, చైతన్య సమర్పిస్తున్నారు. వినయ్ రాయ్ విలన్‌గా కనిపించనున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.    టాలీవుడ్ నుంచి రాబోతున్న మచ్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. సినిమాపై కూడా మంచి హైప్ ఉంది. మూవీ నంచి రిలీజ్ అయిన పొస్టర్స్, సాంగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మూవీ అనౌన్సమెంట్‌తోనే హైప్ క్రియేట్ చేసిన మేకర్స,  టీజర్‌‌తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెంచేశారు.

తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌‌ని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. హనుమాన్ మూవీ ట్రైలర్‌‌ని ఈ నెల (డిసెంబర్) 19న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ట్రైలర్ పోస్టర్‌లో హీరో కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తూ కనిపించారు. అతని వెనుక భారీ హనుమాన్ విగ్రహం ఉంది. అంజనాద్రి ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్న ఈ ట్రైలర్ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. హను–మాన్ సినిమా జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News