Skip to main content

Namaste NRI

దీపావళి శుభాకాంక్షలతో కంగువ… పోస్టర్‌ రిలీజ్

సూర్య  హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కంగువ. శివ డైరెక్ట్ చేస్తున్నాడు. సూర్య 42 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ ‌వీడియో, లాంఛ్ చేశాడు. తాజాగా దీపావళి శుభాకాంక్షలతో మరో పోస్టర్‌ రిలీజ్ చేశారు.కొన్ని రోజుల క్రితం థాయ్‌లాండ్‌లో కీ షెడ్యూల్‌ను పూర్తి చేయగా, ఇటీవలే చెన్నై షెడ్యూల్‌లో ఇవిపి ఫిల్మ్ సిటీలో వార్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేశారు. ఈ షెడ్యూల్‌లో సూర్య, బాబీడియోల్‌, దిశాపటానీపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. వచ్చే నెలలో పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు మొదలుపెట్టనున్నారు మేకర్స్‌. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న కంగువ థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కంగువ ౩డీ ఫార్మాట్‌లో కూడా విడుదల కానుంది. ఈ మూవీకి రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నాడు. కంగువ చిత్రాన్ని 2024 వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events