Skip to main content

Namaste NRI

హీరో సుమంత్ కొత్త చిత్రం.. విశాఖ శారదా పీఠంలో టైటిల్ ప్రకటన

హీరో సుమంత్‌ కొత్త సినిమాకు మహేంద్రగిరి వారాహి అనే పేరును ఖరారు చేశారు. మీనాక్షి కథానాయిక.  రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మిస్తు న్నారు. ఈ చిత్రానికి జాగర్లపూడి సంతోశ్‌ దర్శకుడు. రాజశ్యామలా అమ్మవారి నిత్య ఉపాసకులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి సమక్షంలో ఈ సినిమా టైటిల్‌ని మేకర్స్‌ ప్రకటించారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం నేపథ్యంలో సాగే కథ ఇదని దర్శకుడు చెప్పారు. రాజశ్యామల అమ్మవారు కొలువుదీరిన ఆలయం విశాఖ శారదాపీఠం లోనే ఉన్నందుకు అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడకు వచ్చామని నిర్మాతలు చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో షూటింగ్‌ ప్రారంభించుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే టాకీ పూర్తి చేసుకోనుందని ఈ సందర్భంగా వారు అన్నారు.

Social Share Spread Message

Latest News