హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడిరది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కరోనా కారణంగా ఉప ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. అయితే మళ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. కరోనా నేపథ్యంలో ఉప ఎన్నికను వాయిదా వేసినట్లు సీఈసీ పేర్కొంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా ఆమోదం అనతరం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఉప ఎన్నిక కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశాయి. టీఆర్‌ఎస్ తరపున అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను రంగంలో దింపగా, బీజేపీ తరపున మాజీ మంత్రి ఈటల బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.