Skip to main content

Namaste NRI

ఈ కథ మా అమ్మాయికోసం రాశా : అర్జున్‌ సర్జా   

అర్జున్‌ సర్జా  దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సీతా పయనం. ఐశ్వర్య అర్జున్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రంలో నిరంజన్‌, సత్యరాజ్‌, ప్రకాష్‌రాజ్‌, కోవై సరళ కీలక పాత్రధారులు.అర్జున్‌, ధ్రువ సర్జా పవర్‌ఫుల్‌ పాత్రలు పోషించారు. త్వరలో సినిమా విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో అర్జున్‌ మాట్లాడారు. ఇది మా అమ్మాయికోసం రానుకున్న కథ. కానీ హీరో పాత్ర చాలా బాగా ఎలివేటైంది. మా అమ్మాయితో పాటు నిరంజన్‌ కూడా అద్భుతంగా నటించాడు. తెలుగు ఆడియన్స్‌ నాపై చూపించిన అభిమానాన్ని నా కుమార్తెపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నా. జానాలకు ఈ సినిమా నచ్చుతుందని నా నమ్మకం అని అన్నారు.  

అగ్ర దర్శకులు సుకుమార్‌, ఉపేంద్ర ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఇంకా ఐశ్వర్య అర్జున్‌, నిరంజన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్‌, గీత రచయిత చంద్రబోస్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News