Skip to main content

Namaste NRI

మాకు ఆదేశాలు వస్తే.. ఆరు సెకండ్లలో చేసి చూపుతాం

ఉక్రెయిన్‌ ఆక్రమణపై రష్యా మద్దతుగా నిలిస్తున్న చెచెన్‌ నేత రంజాన్‌ కదిరోవ్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఉక్రెయిన్‌ సమస్య ముగిసింది, తర్వాత పోలాండ్‌ పట్ల ఆస్తకి ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ అనంతరం ఒకవేళ మాకు ఆదేశాలు వస్తే, ఆరు సెకండ్లలో ఏం చేయగలమో చేసి చూపుతాం అంటూ పోలాండ్‌ను హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఆ దేశాన్ని బెదిరించారు. విక్టరీ డే సందర్భంగా పోలాండ్‌లో రష్యా రాయబారిపై ఎరుపు సిరా దాడిని ఖండిరచారు. దీనిపై పోలాండ్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Social Share Spread Message

Latest News