జపాన్ పాస్‌పోర్ట్ ఉన్న వారు ముందస్తు వీసా అవసరం లేకుండానే 193 దేశాలకు ప్రయాణించవచ్చు. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైనదిగా జపాన్ పాస్‌పోర్ట్ నిలుస్తోంది. సింగపూర్, దక్షిణ కొరియా కూడా దాదాపు దీనికి సమానంగానే ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టుదారులు 192 దేశాలకు సులభంగా రాకపోకలు చేయవచ్చు. బ్రిటన్ ఆరో స్థానంలో, అమెరికా 7వ స్థానంలో ఉన్నాయి. ఈ కోవలో భారత్ 87వ స్థానంలో నిలుస్తోంది. హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన పాస్‌పోర్టు సూచీ ఈ విషయాన్ని వెల్లడిరచింది. రష్యా 50వ స్థానంలో, చైనా 69వ స్థానంలో నిలిచాయి. అన్నింటికంటే చివరన అఫ్గానిస్థాన్ ఉంది. ఆ దేశ పాస్‌పోర్టుతో కేవలం 27 దేశాలకు ఎలాంటి అనుమతుల్లేకుండా వెళ్లవచ్చు.














