Skip to main content

Namaste NRI

ఆ దేశ పాస్‌పోర్ట్‌ ఉంటే 193 దేశాలకు.. వీసా లేకుండానే

జపాన్‌ పాస్‌పోర్ట్‌ ఉన్న వారు ముందస్తు వీసా అవసరం లేకుండానే 193 దేశాలకు ప్రయాణించవచ్చు. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైనదిగా జపాన్‌ పాస్‌పోర్ట్‌ నిలుస్తోంది. సింగపూర్‌, దక్షిణ కొరియా కూడా దాదాపు దీనికి సమానంగానే ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టుదారులు 192 దేశాలకు సులభంగా రాకపోకలు చేయవచ్చు. బ్రిటన్‌ ఆరో స్థానంలో, అమెరికా 7వ స్థానంలో ఉన్నాయి. ఈ కోవలో భారత్‌ 87వ స్థానంలో నిలుస్తోంది. హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన పాస్‌పోర్టు సూచీ ఈ విషయాన్ని వెల్లడిరచింది. రష్యా 50వ స్థానంలో, చైనా 69వ స్థానంలో నిలిచాయి. అన్నింటికంటే చివరన అఫ్గానిస్థాన్‌ ఉంది. ఆ దేశ పాస్‌పోర్టుతో కేవలం 27 దేశాలకు ఎలాంటి అనుమతుల్లేకుండా వెళ్లవచ్చు.

Social Share Spread Message

Latest News