Skip to main content

Namaste NRI

నేను మాత్రం ట్విటర్‌లోకి రాను… ట్రుథ్‌ సోషల్‌లోనే

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను తిరిగి పునరుద్ధరించాలని రిపబ్లికన్లు కోరారు. ట్విట్టర్‌ ఎలన్‌ మస్క్‌ చేతిలో వెళ్లిన సందర్భంగా ఇదే సరైన తరుణమని,  ఆయన ఖాతాను తిరిగి పునరుద్ధరించాలని ట్విట్టర్‌ వేదికగా రిపబ్లికన్లు కోరారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్లు హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని, అందుకే  శాశ్వతంగా ఆయన ట్విట్టర్‌ను మూసేస్తున్నట్లు ట్విట్టర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్విట్టర్‌ సామాజిక మాధ్యమాన్ని స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేశారు. కొన్ని రోజుల క్రితమే ఈయన ఈ సంస్థలో 9.2 శాతం వాటా కొనుగోలు చేశారు. ఇకపై మొత్తాన్నీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను పునరుద్ధరించాలని రిపబ్లికన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

                 ఎలాన్‌ మస్క్‌ చేతిలోకి వెళ్లిపోయినందున ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను తిరిగి పునరుద్ధరిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ట్రంప్‌ స్వయంగా సమాధానమిచ్చారు. తాను తిరిగి ట్విట్టర్‌లో ఖాతాను తెరవనని ప్రకటించారు. ఎలన్‌ మస్క్‌ చాలా మంచివారని, అందులో అనుమానం లేదని, అయితే తాను మాత్రం తిరిగి ట్విట్టర్‌ ఖాతాను తెరిచేది లేదని స్పష్టం చేశారు. ట్రుథ్‌ సోషల్‌లోనే వుంటా. ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను మెరుగు పరుస్తారని ఆశిస్తున్నా, అందుకే కొనుగోలు చేశారని అనుకుంటున్నా నేను మాత్రం ట్రూథ్‌ సోషల్‌లోనే వుంటా అంటూ ట్రంప్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events