ఉత్తర అమెరికా తెలుగు సంఘం, దేశీ హ్యాంగ్ ఔట్ ఆధ్వర్యంలో జరిగిన నారీ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ సుమ పాల్గొని వచ్చినవారిని తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. మొట్టమొదటిసారిగా సుమ అస్టిన్ రావడంతో ఈ కార్యక్రమం ఊహించినదానికన్నా ఎక్కువగా విజయవంతం అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన గేమ్ షోలు, డ్యాన్సులు, లైవ్ డిజె కార్యక్రమాలు, ఇంటరాక్టీవ్ గేమ్స్ లలో ఎంతోమంది పాల్గొని ఎంజాయ్ చేశారు. వచ్చినవారికి పసందైన విందు భోజనాలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమం విజయవంతం అవడం పట్ల తానా సౌత్ వెస్ట్ ఆర్ వి పి సుమంత్ పుసులూరి సంతోషం వ్యక్తం చేశారు. తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను, ఆపదలో తానా టీమ్ స్క్వేర్ చేస్తున్న సహాయాన్ని వివరించారు. విజయవాడ వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను తానా ఆదుకుంటున్న విషయాలను కూడా తెలియజేశారు. ఈ వరద సహాయంలో అందరూ పాలుపంచుకుని తానాకు విరాళాలను ఇవ్వాల్సిందిగా కోరారు. తానా సభ్యులు బాలాజీ పర్వతనేని, మురళీ తాళ్ళూరి, శ్రీధర్ పోలవరపు, లెనిన్ యర్రం, చిరంజీవి ముప్పవరపు, సూర్య ముళ్ళపూడి, కావ్య, లావణ్య అనంత, లక్ష్మీ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.