Namaste NRI

మంచు విష్ణు కన్నప్పలో..మ‌రో ఇద్ద‌రు స్టార్స్‌ హీరోలు

మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ను పోషిస్తున్న చిత్రం కన్నప్ప. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ భక్తిరస ప్రధాన చిత్రంలో ప్రభాస్‌, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌ వంటి స్టార్‌ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో సీనియర్‌ నటులు మోహన్‌బాబు, శరత్‌కుమార్‌ సైతం భాగం కాబోతున్నారు. వీరిద్దరి పాత్రలు కథాగమనంలో కీలకంగా ఉంటాయని చిత్ర బృందం పేర్కొంది. త్వరలో ఈ ఇద్దరు అగ్ర నటులు కన్నప్ప సెట్స్‌లో జాయిన్‌ కాబోతున్నారు.  ఇప్పుడు ఈ ఇద్దరు సీనియర్ నటులు కన్నప్ప సెట్స్ మీదకు రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అపర శివభక్తుడు కన్నప్ప జీవిత చరిత్రతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. న్యూజిలాండ్‌లో చిత్రీకరణ జరుగుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events