Skip to main content

Namaste NRI

డొనాల్ట్‌ ట్రంప్‌ పేరుతో … కర్ణాటకలో

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ పేరుతో కర్ణాటకలో జరిగిన భారీ కుంభకోణంలో 150 మందికిపైగా బాధితులు కోటి రూపాయలకుపైగా నష్టపోయారు. ట్రంప్‌ హోటల్‌ రెంటల్‌ అనే యాప్‌ సృష్టించిన సైబర్‌ నేరగాళ్లు,  అందులో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు ఆర్జించవచ్చని ప్రచారం చేశారు. అలాగే, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ట్రంప్‌ మాట్లాడుతున్నట్టుగా వీడియోలను రూపొందించి అమాయకులపై వల విసిరారు.

ఆ వీడియోలు చూసి నిజమేనని నమ్మిన బాధితులు అందులో పెట్టుబడి పెట్టారు. తొలుత ఖాతా తెరిచేందుకని వారి నుంచి రూ.1500 చొప్పున వసూలు చేశారు. ఒక్కో టాస్క్‌ పూర్తయిన వెంటనే ఖాతాలో డబ్బులు జమ అయినట్టు డ్యాష్‌ బోర్డులో చూపించేదని, కానీ, వాస్తవంగా తాను లక్ష రూపాయలు నష్టపోయానని బాధితుల్లో ఒకరు తెలిపారు.

Social Share Spread Message

Latest News