Skip to main content

Namaste NRI

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం.. న్యూజెర్సీలో కార్లతో భారీ ర్యాలీ

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ సందర్భంగా  అమెరికాలోని హిందువులు భారీ కారు ర్యాలీ నిర్వహించారు. న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో సుమారు 350 కార్లతో ర్యాలీ నిర్వహించారు. యూఎస్‌లోని విశ్వహిందూ పరిషత్ యూఎస్ శాఖ కూడా రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని 10 రాష్ట్రాల్లో దాదాపు 40 బిల్ బోర్డులను ఏర్పాటు చేసింది. రామమందిర విశిష్టత, రాముడి గొప్పదనాన్ని తెలియజేస్తూ ఈ బిల్ బోర్డులను ఏర్పాటు చేసింది. టెక్సాస్, ఇల్లినాయ్, న్యూయార్క్, న్యూజెర్సీ, జార్జియా, తదితర రాష్ట్రాల్లో రాముడు, రామమందిరం చిత్రాలున్న బిల్ బోర్డులు దర్శనమిచ్చాయి. కాషాయ వర్ణంలో శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు కార్లపై రెపరెపలాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

రామమందిర ప్రారంభోత్సవం కోసం అమెరికాలోని హిందువులు ఆతృతగా ఎదురుచూస్తున్నారని హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా జనరల్ సెక్రెటరీ తెలిపారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అమూల్య ఘట్టంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతు న్నాయని వెల్లడించారు. కాగా, అమెరికా వ్యాప్తంగా పలు చోట్లు హిందులు కారు ర్యాలీలు, ఇతర కార్యక్రమాలతో ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events