Namaste NRI

పర్యాటక ప్రదేశాలను స్వదేశీ దర్శన్‌ లో చేర్చండి

తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలను స్వదేశీ దర్శన్‌, ఆలయాలను ప్రసాద్‌ స్కీంలలో చేర్చి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కేంద్రాన్ని కోరారు. ఢల్లీి పర్యటలో ఉన్న ఆయన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని డెవలప్‌మెంట్‌ అండ్‌ నేచర్‌ టూరిజం సర్క్యూట్‌ను స్వదేశీ దర్శన్‌ స్కీం ద్వారా అభివృద్ధి చేయాలని కోరుతూ అందుకు సంబంధించిన వివారలు అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని చరిత్రాత్మక కోటలను స్వదేశీ దర్శన్‌ స్కీంలో చేర్చి అభివృద్ధి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ బుద్దిస్‌ సర్క్యూట్‌ను స్వదేశీ దర్శన్‌ స్కీం ద్వారా అభివృద్ధి చేయాలన్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, భద్రాచాలంలోని సీతరామచంద్రస్వామి దేవస్థానాలను ప్రసాద్‌ స్కీం ద్వారా అభివృద్ధి చేయాలన్నారు. హైదరాబాద్‌ నగరం పర్యాటక, వైద్య రాజధానిగా అభివృద్ధి చెందుతున్నందున ఇండియణ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐటీఎం) ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన భూమిని ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని, అందుకు అవసరమైన అనుమతులివ్వాలని అన్నారు.

Social Share Spread Message

Latest News